రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

ఠాగూర్

ఆదివారం, 9 మార్చి 2025 (16:30 IST)
ఢిల్లీ వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రైలు వస్తుండటంతో గేట్ మ్యాన్ గేటును మూసివేశారు. అయితే, రైలు వెళ్లేంత వరకు వేచి చూడలేని ఓ యువకుడు బైకు మోసుకుంటూ గేటుదాటాడు. ఇది చూసిన మిగిలిన వాహనదారులు నివ్వెర పోయారు. రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైకు ఎత్తిన యువకుడుని అభినవ బాహుబలిగా అభివర్ణించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఢిల్లీలో రైలు వస్తుండటంతో రైలు గేటును క్లోజ్ చేశారు. అంతలో అటుగా వచ్చిన ఓ బైక్ వాలా రైలు వచ్చేంత వరకు వేచి చూడటం సమయం వృథా అనుకున్నాడు. వెంటనే బైకును భుజానికి ఎత్తుకుని రైల్వే గేటు దాటాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఇతర వాహనదారులు బిత్తరపోయారు. బైకును మోసుకుంటూ బాహుబలిలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది. 
 

రైల్వే క్రాసింగ్‌ను దాటేందుకు.. బైకర్‌ ఏం చేశాడో చూడండి!

న్యూఢిల్లీ: రైల్వే క్రాసింగ్‌ వద్ద వేచి ఉండటాన్ని ఒక బైకర్‌ సహించలేకపోయాడు. ఏకంగా బైక్‌ను భుజంపైకి ఎత్తుకున్నాడు. రైలు గేటు పక్క నుంచి వెళ్లి పట్టాలు దాటాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. pic.twitter.com/ry9sny3qPB

— Swathi Reddy (@Swathireddytdp) March 9, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు