భార్య పెదాలకు ఫెవిక్విక్ పూసిన భర్త.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!!

ఠాగూర్

శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (08:41 IST)
తన భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్త అనుమానించాడు. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగుతూ వచ్చాయి. దీంతో భార్యపై కోపాన్ని పెంచుకున్న భర్త.. ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. అదీకూడా గొంతునులిమి చంపాలని అనుకున్నాడు. ఆ సమయంలో భార్య కేకలు వేయకుండా ఉండేలా పెదాలకు ఫెవిక్విక్ పూశాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి జారుకుంది. దీంతో భయపడిపోయిన భర్త అక్కడ నుంచి పారిపోయాడు. 
 
ఉప్పల్ ప్రాంతానికి చెందిన సిద్ధిలింగ స్వామి తన భార్య మంజులపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఎవరితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. 
 
ఈ గొడవ కారణంగా కోపోద్రేకానికి గురైన సిద్ధలింగస్వామి మంజలు నోటికి ఫెవిక్విక్ వేసి ఆమెను చంపేందుకు యత్నించాడు. అయితే, అదృష్టవశాత్తూ ఇరుగుపొరుగు వాళ్లు గమనించండంతో సిద్ధలింగస్వామి అక్కడ నుంచి పారిపోయాడు. 
 
ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు నోటికి వేసిన ఫెవిక్విక్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. పోలీసులు సిద్ధలింగస్వామిని మొబైల్ సిగ్నల్ ఆధారంగా అరెస్టు చేశారు. ఎందుకిలా చేశావని పోలీసులు ఆరా తీస్తే ఆమెకు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అందుకే ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు