మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

ఠాగూర్

సోమవారం, 14 ఏప్రియల్ 2025 (09:51 IST)
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఫలక్‌నుమా రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ (మాసిని) దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపేశారు. 
 
మూడు రోజుల క్రితమే మాస్ యుద్దీన్ వివాహం జరిగింది. ఆయన ప్రత్యర్థులే ఈ హత్యకు పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. 
 
నడిరోడ్డుపై రౌడీ షీటర్ హత్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుండగుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ హత్య తర్వాత పాత బస్తీలో పోలీసులను అప్రమత్తం చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు