రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

ఠాగూర్

ఆదివారం, 11 మే 2025 (10:16 IST)
కొందరు యువత రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత తామోదే ఘనకార్యం చేసినట్టుగా సంబరపడిపోతున్నారు. తాజాగా ఓ యువకుడు రైలు వస్తుంటే దానికింద పడుకుని రీల్స్ చేశాడు. 
 
అమిత వేగంతో వెళుతున్న రైలు వెళుతుంటే పట్టాలపై పడుకున్నాడు. రైలు వెళ్లిన తర్వాత పైకిలేచి.. తాను ఏదో సాధించినట్టుగా తెగ సంతోషపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం యువకులు ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం అంటూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇలాంటి చేష్టలు యువకులకు సరదాగా అనిపించవచ్చు కానీ, జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అంటూ యువతను హెచ్చరించారు. 
 

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత..

వ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన యువకుడు

రైలు వెళ్తుండగా పట్టాలపై పడుకున్న యువకుడు

సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం అంటూ ఎక్స్ లో వీడియో షేర్ చేసిన సజ్జనార్

ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు..… pic.twitter.com/1TutyAk80Z

— BIG TV Breaking News (@bigtvtelugu) May 11, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు