మెంటల్‌కృష్ణ, రాజావారి చేపల చెరువు వంటి చిత్రాల ద్వారా హీరోగా ముద్రవేసుకున్న ప్రముఖ దర్శకుడు పోసాని కృష్ణమురళి "గాలిశీను" ద్వారా తెరపైకి రానున్నారు. పి. ఉదయభాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి స్వప్నమూవీస్ పతాకంపై ఎం.వి. కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.
టైటిల్ రోల్‌ను హనీఫ్ అనే నూతన నటుడు పోషిస్తుండగా, మెంటల్ కృష్ణ ఫేమ్ సత్యకృష్ణన్ మళ్లీ గాలిశీనులో హీరోయిన్‌గా నటించడం విశేషం. వీధి రౌడీ నుంచి డాన్ స్థాయికి ఎదగాలనుకునే రౌడీ కథే గాలిశీను అని దర్శకుడు తెలిపారు. చక్కటి హాస్యభరిత చిత్రంగా గాలిశీను తెరకెక్కనున్నాడని ఆయన తెలిపారు.
తెలుగులో పలు సీరియల్స్ చేసిన తాను దాసరి నిర్మించిన "మధ్యతరగతి మహాభారతం" చిత్రానికి దర్శకత్వం వహించానని, ప్రస్తుతం వెంగమాంబకు దర్శకత్వం వహిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ పూర్తయి సెన్సార్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు.
ఆర్.కె.ఫిలిమ్స్ ద్వారా రామకృష్ణ గౌడ్ సహకారంతో గాలిశీనును విడుదల చేస్తున్నామని నిర్మాత కృష్ణ ప్రసాద్ అన్నారు. యాక్షన్, కామెడీ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని ఆయన వెల్లడించారు.
ఇందులో ఐదు పాటలు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయని, ఆద్యంతం వినోదభరితంగా గాలిశీను రూపుదిద్దుకున్నాడని ఆర్.కె. ఫిలిమ్స్ పంపిణీదారుడు రామకృష్ణగౌడ్ అన్నారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం: అర్జున్.