ఆంధ్రప్రదేశ్‌లో తగ్గని కరోనా వేగం : కొత్తగా మరో 35 కేసులు

మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (13:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మరో కొత్తగా మరో 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త 35 కేసుల్లో ఒక్క కర్నూలు జిల్లాలో 10 కేసులు నమోదు కాగా, గుంటూరులో 9, కడప 6, వెస్ట్ గోదావరిలో 4, కృష్ణా 3, ఆనంతపురం 3 చొప్పున మొత్తం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. అయితే.. కరోనాతో ఇప్పటివరకూ మొత్తం 22 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలావుంటే, 639 మందికి చికిత్స  కొనసాగుతుండగా 96 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
జిల్లాల వారీగా కేసులు లెక్కలు చూస్తే... అనంతపూరంలో 36, చిత్తూరులో 53, ఈస్ట్ గోదావరిలో 26, గుంటూరులో 158, కడపలో 46, కృష్ణలో 83, కర్నూలులో 184, నెల్లూరులో 67, ప్రకాశంలో 44, విశాఖపట్టణంలో 21, వెస్ట్ గోదావరిలో 39 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు