సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ మరో అద్భుత ఫీచర్‌తో ముందుకొచ్చింది. యూజర్లకు పదే పదే చిరాకు తెప్పిస్తున్న ఫార్వర్డెడ్ మెసేజ్‌ల గుట్టు విప్పనుంది. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని వివిధ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్న వారి బాగోతం బయటపెట్టనుంది.
ఈ క్రమంలో తప్పుడు మెసేజ్ బారి నుంచి తప్పించడానికి ఫార్వర్డెడ్ లేబుల్ ఫీచర్‌ను లాంచ్ చేసింది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా ఫార్వర్డ్ మెసేజ్‌లకు, రెగ్యులర్ మెసేజ్‌లకు తేడా కనిపెట్టవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.