హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

ఠాగూర్

మంగళవారం, 6 మే 2025 (18:48 IST)
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు యుద్ధ సన్నద్ధత చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 244 జిల్లాల్లో భద్రతా విన్యాసాలు (మాక్ డ్రిల్స్) చేపట్టనున్నారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెల్సిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. దీంతో భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పౌరులు, భద్రతా సిబ్బందిని సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్స్‌ను చేపడుతున్నారు. 
 
నగరంలోని నాలుగు వ్యూహాత్మక ప్రాంతాలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్‌బాగ్, డీఆర్‌డీవో, మౌలాలిలోని ఎన్‌ఎఫ్సీలలో బుధవారం సాయంత్రం 4 గంటలకు భద్రతా విన్యాసాలు ఏకకాలంలో నిర్వహించనున్నట్టు రక్షణ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 
అలాగే, దేశ వ్యాప్తంగా 259 సున్నిత ప్రదేశాలలో ఈ మెగా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మాక్ డ్రిల్స్ నిర్వహణపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో దాడులకు  అవకాశం ఉన్న ప్రాంతాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించిన విషయం తెల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్టణం ప్రాంతాలను కేటగిరీ 2లో చేర్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు