మేషం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అభియోగాలకు దీటుగా స్పందిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృషభం
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. అపోహలకు తావివ్వవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. దుబారా ఖర్చులు విపరీతం, పనులు సానుకూలమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ముగుస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది.
కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్దల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. పిల్లల దూకుడు అదుపుచేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
కన్య
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికసమస్య కొలిక్కివస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. కీలక సమావేశంలో పాల్గొంటారు.
తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది.. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వేడుకకు హాజరవుతారు.
ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. దూరపు బంధువులను కలుసుకుంటారు.
మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త.
కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు పట్టుదలతో శ్రమిస్తారు. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు సాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
మీనం
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు పురమాయించవద్దు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. ఏకాగ్రతతో వాహనం నడపండి.