మేషం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృషభం
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయస్తుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి బాగుంది. సంప్రదింపులు ముగుస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు.
సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు విపరీతం విలాస వస్తువులు కొనుగోలు చెస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి.
కన్య
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలం. రుణ సమస్య తొలగుతుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. దుబారా ఖర్చులు విపరీతం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు., కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని విషయాలకు ఆందోళన చెందుతారు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఆరోగ్యం జాగ్రత్త మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. నోటీసులు అందుకుంటారు.
ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ధనసహాయం తగదు. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవచ్చు.
మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహమరమ్మత్తులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకోవటానికి శ్రమించండి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. రోజువారి ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు సాయం అర్ధిస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ప్రయాణం విరమించుకుంటారు.
మీనం
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మంచి ఫలితాలున్నాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పొగిడే వారితో జాగ్రత్త. పనులు ఇతరులకు అప్పగించవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సాహసకృత్యాలకు పాల్పడవద్దు.